విబజన నినాదం రాజశేఖరరెడ్డి హయాంలో ఉన్నా, రాష్ట్రం అబివృద్ది జరగాలని ఆయన సంకల్పిచంచారని, జలయజ్ఞం , పారిశ్రామికాభివృద్దికి కృషి చేశారని,జిల్లాకు ఒక విశ్వవిధ్యాలయం, ఎన్నో విద్యా సంస్థలను అన్ని ప్రాంతాలలో చేశారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు.ఎవరి మనో భావాలు దెబ్బతినకుండా, విభజన చేయవలసి వస్తే తండ్రి వలే న్యాయం చేయాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ చెప్పిందని అన్నారు. అదికారపక్షం విబజన చేస్తోందని, మిత్ర పక్షాలతో మాట్లాడి తెలంగాణ ప్రకటించారని, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఎందుకు పిలవలేదని ఆమె ప్రశ్నించారు. నీటి సమస్యలు హైదరాబాద్ సమస్య లు మొదలైనవాటిని గురించి అడిగి ఉండాల్సిందని అన్నారు. ఇంకా విభజన జరగకముందే హైదరాబాద్ నుంచే ఆంధ్ర ఉద్యోగులు వెళ్లాలని అంటున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పినందువల్ల తెలంగాణను తేలికగా ఇచ్చేశారని ఆమె విమర్శించారు. సమన్యాయం జరగాలని కోరామని అన్నారు.జగన్ కు సీట్లు వస్తాయని భయపడే తెలంగాణ ఇచ్చారని ఆమె ఆరోపించారు.ఓట్లు,సీట్లు కోసం రాష్ట్ర విభజన జరగడం దారుణమని ఆమె విమర్శించారు.
0 Reviews:
Post a Comment