Contact us

బాలకృష్ణ ఇంట పెళ్లిలో కన్పించని జూనియర్
ప్రముఖ నటుడు, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ ఇంట వివాహానికి ఆయన సోదరుడు , రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, అలాగే జూనియర్ ఎన్.టి.ఆర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయింది.దీంతో నందమూరి కుటుంబంలో విబేధాలు బహిర్గతం అయ్యాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే జూనియర్ అబిమానులు , బాలకృష్ణ అభిమానులు వీరిద్దరూ ఎదురు చూసి వారు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా జూనియర్ ఎన్.టి.ఆర్.ను అసలు ఆహ్వానం అందలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జూనియర్ ఎన్.టి.ఆర్., లోకేష్ ల మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు కూడా ఈ పెళ్లికి ఆహ్వానించకపోవడంపై ప్రభావం పడిందా అన్న చర్చ జరుగుతోంది.ఆ మధ్యకాలంలో బాలకృష్ణ,జూనియర్ ఎన్.టి.ఆర్. లు కొన్ని వేదికలపై కలిసి కనిపించినా, తదుపరి కాలంలో మళ్లీ అంతరం ఏర్పడింది.జూనియర్ ఎన్.టి.ఆర్.ను పిలవనందునే హరికృష్ణ కూడా రాలేదని ప్రచారం జరుగుతోంది.

0 Reviews:

Post a Comment