హైదరాబాద్, ఆగష్టు 5 : రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదని, ఎలాంటి అపోహలు పెట్టుపోవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభ్యుడు హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం విద్యుత్ సౌధ వద్ద టీ. ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏమైనా సంశయాలు ఉంటే చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
అనవసరంగా సీమాంధ్ర పెట్టుబడిదారి రాజకీయ నేతల మాటలో ఉచ్చులో సీమాంధ్ర ఉద్యోగులు పడవద్దని హరీస్‌రావు కోరారు. భారత దేశానికి ఒక చట్టం ఉందని, దేశంలో గతంలో ఏర్పడిన నాలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రం అవలంభించిన విధివిధానాలనే అనుసరిస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి ఎవరిని వెళ్లగొట్టరని స్పష్టం చేశారు. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారినైనా తెలంగాణ ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని తెలిపారు.

0 Reviews:
Post a Comment