వైయస్ జగన్‌ను జాతి గౌరవం పెంచిన మహాత్మా గాంధీ, భగత్ సింగ్‌లతో పోల్చడం అవమానకరమన్నారు. ఆయనను దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ వంటి వారితో పోల్చాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నడిపారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఎన్నో సభల్లో చెప్పారన్నారు. తమతోనే తెలంగాణ వస్తుందని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారని వైయస్ చెప్పారన్నారు.వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతున్న సమ న్యాయం అంటే బ్రదర్ అనిల్ కుమార్‌కు బయ్యారం గనులు రాసివ్వడమా, హైదరాబాదులో జగన్ చేస్తున్న విచ్చలవిడి దోపిడీకి అనుమతులు ఇవ్వడమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని అదుపు చేస్తే రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడతాయన్నారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
0 Reviews:
Post a Comment