Contact us

సినిమాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఖబడ్దార్ !
http://telugu.oneindia.in/movies/news/2013/08/power-star-pawan-kalyan-fans-rally-120617.html
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' సినిమా ఆగస్టు 9న విడుదలవ్వాల్సి ఉండగా...కొందరు వ్యక్తులు సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించడంతో విడుదల నిలిపి వేసారు. సినిమాను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు ర్యాలీ నిర్వహించారు.
చిరంజీవి వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపిస్తూ.... ఆయన వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కొన్ని పార్టీల రాజకీయ నాయకులు, సమైక్య వాదులు డిమాండ్ చేసారు. అంతటితో ఆగకుండా ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డకుంటామని హెచ్చరించారు. దీంతో రామ్ చరణ్ నటించిన ‘ఎవడు' సినిమాతో పాటు ‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని కూడా విడుదల వాయిదా వేసారు.
ఏమిటీ అన్యాయం? పవన్ ఫ్యాన్స్ ర్యాలీ!
అయితే రాష్ట విభజన గొడవల్లోకి మెగా ఫ్యామిలీని అన్యాయంగా లాగుతున్నారని, ఇది సమంజసం కాదంటూ పవర్ కళ్యాణ్ అభిమానులు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ర్యాలీ నిర్వహించారు. మెగా ఫ్యామిలీపై రాజకీయ కుట్ర చేస్తున్నారని మండి పడ్డారు.
మరో వైపు, మెగా హీరోల సినిమాలను విడుదల కాకుండా ఆపితే చూస్తూ వూరుకోబోమని 'చిరంజీవి యువత' పేర్కొంది. సినిమాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమకారుల పేరిట మా హీరోల బొమ్మలు తగలబెడితే సహించబోమని, కుటిల రాజకీయాలను తిప్పికొడతామని హెచ్చరించారు. మెగా హీరోలపై తాము చూపే అభిమానానికి సరిహద్దులు, ప్రాంతాలు, పార్టీలు లేవని, అభిమానుల మనోభావాలను దెబ్బతీస్తే తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు.
మరో ప్రక్క పవన్ కళ్యాణ్ అభిమానులు రాష్ట్రంలోని ఉద్యమ జేఏసీలకు హెచ్చరికలు జారీ చేసారు. ఈ మేరకు సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఉద్యమకారులకు సందేశాలు పంపుతున్నారు. మా హీరో జోలికి రావొద్దు...సినిమాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.


0 Reviews:

Post a Comment