Contact us

కెసిఆర్ హత్యకు కుట్ర జరుగుతోంది!
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు హత్య కు కుట్ర జరుగుతోందని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు , సీనియర్ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేందర్ లు ఆరోపించారు. ఇందుకోసం సుపారి కూడా ఇచ్చారని వారు అన్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరు ఈ కుట్ర చేస్తున్నది బయటపెడతామని వారు అన్నారు.దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు.కెసిఆర్ కు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని, ఆయనకు ఏదైనా జరిగితే తెలంగాణ కల్లోలం అవుతుందని వారు హెచ్చరించారు.ఇది చాలా సీరియస్ అబియోగంగా తీసుకోవాలి.నిజంగానే అలాంటి కుట్ర జరుగుతుంటే వాటిని భగ్నం చేయవలసి ఉంది.ఇందుకు సంబందించి ఆధారాలు హరీష్ రావు, రాజేందర్ వద్ద ఉంటే వాటిని పోలీసులకు అందించాల్సిన అవసరం ఉంది.

0 Reviews:

Post a Comment