
రాష్ట్ విభజనకు ,మరణించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ముడి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడడం సిగ్గు చేటు అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు ద్వజమెత్తారు.మరణించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చి సమాధానం చెప్పుకోలేరని ప్రతీ విషయాన్ని ఆయనకు అంటగట్టి నీచమైన రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని ఆయన ఆరోపించారు.గతంలో చిరంజీవిని పార్టీలోకి చేర్చుకునేటప్పుడు కూడా ఆ నెపాన్ని వైఎస్‌పైనే నెట్టే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు.వై.ఎస్.బతికి ఉన్నప్పుడు తెలంగాణపై సిడబ్య్లుసి ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.అప్పుడు, ఇప్పుడు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నది కిరణ్ అని అంబటి విమర్శించారు.
0 Reviews:
Post a Comment