Contact us

జగన్ ను తీహారు జైలుకు పంపాలి
టిడిపి నేత ముద్దు కృష్ణమనాయుడు మరో అడుగు ముందుకు వేస్తున్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతలు జైలులో దీక్ష చేస్తున్న జగన్ ను సీమాంధ్ర జిల్లాల జైలుకు తరలించాలని డిమాండ్ చేస్తే, ముద్దు ఏకంగా తీహారు జైలుకు పంపాలని అంటున్నారు.అక్కడైతే ములాఖత్ లు ండవని ఆయన అన్నారు.కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,టిఆర్ఎస్ లు త్రయంగా మారి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన అన్నారు.జగన్ జైలులో యధేచ్చగా సెల్ ఫోన్ లు ఇతర సదుపాయాలు వాడవచ్చా అని ఆయన అన్నారు. సిబిఐ,ఇడి కేసులు ఎందుకు నెమ్మదించాయని ఆయన ప్రశ్నించారు.

kommineni

0 Reviews:

Post a Comment