Contact us

చిరంజీవిని రాళ్లతో కొట్టాలి: శోభారాణి
చిరంజీవిని రాళ్లతో కొట్టాలి: శోభారాణి
రాష్ట్ర విభజనకు కేంద్రం నిర్ణయం తీసుకుని ప్రకటించడంతో నిరసన వ్యక్తం చేస్తూ అప్పటి ప్రజారాజ్యం పార్టీ నేత శోభారాణి శుక్రవారం శ్రీనగర్‌లోని తన నివాసంలో తనకు తానుగా స్వీయ నిర్బంధం చేసుకున్నారు. ఆమెతో పాటు మరో 10 మంది నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొంతమంది కుట్ర దారులు తమ రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభ జించడాన్ని ఖండిస్తున్నట్లు శోభారాణి పేర్కొన్నారు.

కొందరు నేతల స్వార్థం వల్లనే రాష్ట్రం విడిపోతుందని శోభారాణి మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత్ వదిలి వెళ్లాలన్నారు. రాష్ట్రంలో ఉన్మాద పరిస్థిత ఉందని, బయటకు వెళ్లే పరిస్థితి లేదని అందుకే తాను గృహ నిర్బంధంలో ఉన్నానని చెప్పారు. విభజనకు చిరంజీవే ప్రధాన కారణమన్నారు. చిరంజీవి రాజీనామా చేయని పక్షంతో ఆయనను రాళ్లతో కొట్టాలన్నారు. చిరంజీవి అంటే ఇప్పుడు ఎవరికి అభిమానం లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి వెళ్లినా, సీమాంధ్రకు వెళ్లినా ఆయనను కొడతారన్నారు. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోను నటుడే అని శోభారాణి విమర్శించారు.

0 Reviews:

Post a Comment