Contact us

గాంధీజీతో జగన్ ను పోల్చుతారా!
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ అధికార ప్రతినిది అంబటి రాంబాబు మరీ గాందీజీతో పోల్చడం అంత కరెక్టేనా అన్న ప్రశ్న వస్తుంది.తమ నాయకుడిని పొగడడం తప్పు కాదు కాని, మరీ అతిగా పొగిడితే అది 
వెగటించే ప్రమాదం ఉంటుంది. జైల్లో ఉండి కూడా ప్రజల కోసం పోరాడే చిత్తశుద్ధి ఒక్క వైఎస్ జగన్‌ మోహన రెడ్డికే ఉందని రాంబాబు అన్నారు. జగన్‌ దీక్ష చేయడానికి కేసీఆర్‌, హరీష్‌రావు, గుత్తా సుఖేందర్‌రెడ్డిల అనుమతి అవసరంలేదని ఆయన వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ కూడా తాను జైల్లో ఉన్న కాలంలో ఐదుసార్లు నిరాహార దీక్ష చేశారని ఆయన అంటున్నారు.

0 Reviews:

Post a Comment