Contact us

రెండోరోజుకు చేరిన జగన్ దీక్ష
రెండోరోజుకు చేరిన జగన్ దీక్ష
హైదరాబాద్: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైల్లో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. నిన్నరోజంతా ఎలాంటి ఆహారం తీసుకోని వైఎస్‌ జగన్‌... దీక్షను అలాగే కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా అల్పాహారం తీసుకునేందుకు నిరాకరించారు. అన్నపానీయాలు ముట్టకోకపోవడంతో వైఎస్‌ జగన్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది.

ఈరోజు ఉదయం పది గంటలకు జైలు అధికారులు జగన్ ను కలవనున్నారు. దీక్ష విరమించాల్సిందిగా జైలు అధికారులు ఆయనను కోరే అవకాశం ఉంది. జైలు వైద్యులు జగన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించే అవకాశముంది. మరోవైపు జగన్‌ నిరవధిక నిరాహార దీక్షకు సీమాంధ్రజిల్లాలో పెద్దఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎక్కడిక్కడ రోడ్లెక్కుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలుచేసిన కాంగ్రెస్‌ తీరును ఎండగడుతున్నారు.

0 Reviews:

Post a Comment