Contact us

హైదరాబాద్ ను అమ్మకానికి పెట్టిన బాబు
సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిపోతున్నా టిడిపి అధినేత చంద్రభాబు నాయుడు మాట్లాడకుండా, కాంగ్రెస్ ను విమర్శించడం లేదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల ఆరోపించారు. చివరికి హైదరాబాద్ ను అమ్మకానికి పెట్టిన ఘనుడు చంద్రబాబు అని ఆమె అన్నారు. సీమాంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుంటే నాలుగైదు లక్షల కోట్లు ఇవ్వాలని అంటున్నారని ఆమె అన్నారు.గత నాలుగేళ్లుగా అన్ని ఎన్నికలలో ఓడిపోయిన చంద్రబాబును మరోపార్టీ అయితే పార్టీ అద్యక్షపదవి నుంచి తొలగించేదని అన్నారు. చంద్రబాబు కు అధికారం ఇవ్వడం అంటే మన గొయ్యి మనమే తవ్వకున్నట్లని అన్నారు. మామను వెన్నుపోటు పొడిచి, ఆయననే పార్టీనుంచి బయటకు పంపినవాడు చంద్రబాబు అని ఆమె విమర్శించారు. ప్రజలను కాల్చుకుని తిని, మాయజపం చేసిన కొంగ వంటి వాడు చంద్రబాబు అని ఆమె ధ్వజమెత్తారు.ఐఎమ్జీ, కాకినాడ పోర్టు తదితర ఎన్నో కుంభకోణాలు ఉన్నా చిదరంబరంతో చీకట్లో ఒప్పందం పెట్టుకోవడమే కారణమని అన్నారు.

 జగన్ పై ఇంతవరకు ఎందుకు కేసు పెట్టారో తేల్చుకోలేకపోతున్నారని, జగన్ జననేతగా ఎదుగుతుంటే, కాంగ్రెస్,టిడిపిలు దుకాణాలు మూసివేసుకోవాలని భావించి సిబిఐని ఉసి కొల్పారని అన్నారు. కోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు జగన్ ఏభై రెండో ప్రతివాది అని ,కాని కేసు వచ్చేసరికి మొదటి నిందితుడుగా సిబిఐ పెట్టిందని,దాంతోనే సిబిఐ తీరు అర్ధం అయిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పెరట్లో గుంటనక్క అని అనాలా?కాంగ్రెస్ కుక్క లా మారిందని ఆమె అన్నారు.విచారణ జరపవలసింది సిబిఐమీదనా, కాంగ్రెస్ పైనా, కుమ్మక్కయిన చంద్రబాబు పైనా అని షర్మిల ప్రశ్నించారు.చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నందున ఆయనపై కేసులు విచారణకు రాకుండా చేయడం క్విడ్ ప్రో కో కాదా అని షర్మిల ప్రశ్నించారు.జగన్ బోనులో ఉన్నా సింహమేనని అన్నారు. ఆయనను ఆపడం కాంగ్రెస్,టిడిపిల వల్ల కాదని షర్మిల స్పష్టం చేశారు.పాదయాత్రలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు తెలిపారు.

0 Reviews:

Post a Comment