తన పాదయాత్ర సాగిన తీరు పట్ల తన సోదరుడు జగన్ మోహన రెడ్డి చాలా సంతోషంగా ఉన్నారని, తామందరినీ ఆయన అభినందించారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పక్షాన పాదయాత్ర పూర్తి చేసిన షర్మిల చెప్పారు.చంచల్ గూడ జైలులో జగన్ ను కలిసిన తర్వాత జైలు బయట విలేకరులతో ఆమె మాట్లాడారు. తమను ఆశీర్వదించి, తమ సహకారం అందించిన ప్రజలకు, పాదయాత్రను ఆశీర్వదించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు. తన సోదరుడితో పాదయాత్ర అనుభవాలను ఆమె పంచుకున్నారు.
0 Reviews:
Post a Comment