
తెలంగాణపై నిర్ణయం చేసిన తర్వాత ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ వెనక్కి తీసుకుంటారని అనుకోవడం లేదని కేంద్ర మంత్రి కోట్ల సూరప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.రాయలసీమ, ఆంద్ర ప్రయోజనాలను తాము కాపాడుతామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు.తమ రాజీనామా డిమాండ్ చేస్తున్నవారికి ఒకటే సమాధానం చెబుతున్నానని, తాము పదవిలో ఉండబట్టే , ఈ సమస్యపై సోనియాగాంధీతో మాట్లాడగలిగామని ఆయన అన్నారు.ఎక్కడో పొరపాటు జరిగిందన్న భావన అదిష్టానంలో ఉన్నట్లు కనిపించిందని ఆయన అన్నారు.తమ వాదనలను ఆంటోని కమిటీకి వినిపించాలని కూడా సోనియా సూచించారని కోట్ల చెప్పారు. మొత్తం మీద సోనియా తెలంగాణపై వెనక్కి వెళ్లేలా లేరన్న అబిప్రాయాన్ని కోట్ల వ్యక్తం చేస్తున్నారు.సోనియాగాందీని ఆయన బృందం కలిసి వచ్చిన తర్వాత మాట్లాడారు.
0 Reviews:
Post a Comment