Contact us

'జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకుంటాం
జూనియర్ ఎన్.టి.రామారావు సినిమాలపై ఆయన తండ్రి, రాజ్యసభకు రాజీనామా చేసిన హరికృష్ణ ప్రభావం పడేలా ఉంది.హరికృష్ణ సమైక్యాంద్రకు మంద్దతుగా రాజీనామా చేసినందున ఆయన కొడుకు ఎన్.టి.ఆర్. సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని ఓయు జెఎసి హెచ్చరించింది. జూనియర్ ఎన్టీఆర్ సమైక్యావాదో, తెలంగాణవాదో స్పష్టం చేయాలని జెఎసి కోరింది.త్వరలో రామయ్య వస్తావయ్యా అనే సినిమా విడుదల కావల్సి ఉంది.తన తండ్రి రాజీనామా వ్యవహారం జూనియర్ ఎన్టీఆర్ మెడకు చుట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్య వస్తావయ్యా' చిత్రం త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.

0 Reviews:

Post a Comment