ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కంట్రోల్ చేసి, జగన్‌ను వేరే జైలుకు తరలిస్తే సమైక్యాంధ్ర ఉద్యమం ఆగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు వరంగల్ జిల్లాలో అన్నారు. జగన్‌ను తీహార్ జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెసు రెండు ప్రాంతాల్లో నాటకాలు ఆడిస్తోందని, విజయమ్మ దీక్ష, ఢిల్లీ పర్యటన అందులో భాగమేనని ఆరోపించారు. పార్లమెంటులో బిల్లు పెడితే టిడిపి మద్దతిస్తుందన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు
0 Reviews:
Post a Comment