హైదరాబాద్ : హైదరాబాద్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను తాము అంగీకరించేది లేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అగ్నిగుండమే అవుతుందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని దానం తెలిపారు. ఆంటోనీ కమిటీ ముందు తమ వాదనలు వినిపిస్తామని దానం తెలిపారు. హైదరాబాద్ పై అధిష్టానం పునరాలోచన చేస్తుందనే అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని దానం డిమాండ్ చేశారు.
0 Reviews:
Post a Comment