Contact us

ఈ ఏడాది పెళ్లిరోజూ జైలులోనే
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది పెళ్లి రోజు కూడా జైలులోనే గడపవలసి వచ్చింది.జగన్ దీక్షలో ఉండడంతో ఆయనను భార్య భారతి కలవలేకపోయారు.
గత ఏడాది ఆమె కలవగలిగినా, ఈ సారి దీక్ష చేస్తుండడంతో అధికారులు అనుమతించలేదు. గత ఏడాది పెళ్లిరోజు కూడా జగన్ మోహన్ రెడ్డిని భారతి జైల్లోనే కలిశారు.

ఈ సందర్భంగా వారిద్దరు మాట్లాడుకునే సమయంలో కూడా  జైలు అధికారులు అక్కడ నుంచి కదలలేదు. అదేమని అడిగితే తాము ఏమీ వినటం లేదని ....మీరు మాట్లాడుకోండంటూ అధికారులు చెప్పటం గమనార్హం. సమన్యాయం చేయాలంటూ జగన్ జైల్లో దీక్షకు దిగటంతో ఆయన్ని కలిసేందుకు జైలు అధికారులు అనుమతించటం లేదు.


కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా చంచల్‌గూడ జైల్లో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షపై జైలు అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టుకు సమాచారం ఇచ్చారు. జగన్ దీక్షపై తగు చర్యలు తీసుకోవాలని కోర్టును అధికారులు వారు కోరారు.

0 Reviews:

Post a Comment