Contact us

చిరంజీవి ఓ బచ్చా: అసదుద్దీన్‌
చిరంజీవి ఓ బచ్చా: అసదుద్దీన్‌కు రోషంహైదరాబాద్: విభజన నేపథ్యంలో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే కేంద్ర మంత్రి చిరంజీవి డిమాండ్‌పై హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి రోషం వచ్చింది. చిరంజీవిని రాజకీయాల్లో ఓ బచ్చాగా ఆయన అభివర్ణించారు. చిరంజీవి డిమాండ్‌పై ఆయన చాలా కరుగ్గా ప్రతిస్పందించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అసదుద్దీన్ ఓవైసీ కోరుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ తమదని, హైదరాబాద్ అందరిదని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమాలు తలెత్తుతాయని అసదుద్దీన్ అన్నారు. చిరంజీవి రాజకీయాల్లో పిల్లవాడని, తన సొంత పార్టీనే నడుపుకోలేకపోయాడని అంటూ హైదరాబాద్ గురించి, తాను హోదా గురించి ఎందుకు మాట్లాడుతాడని ఆయన అడిగారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ హైదరాబాదును పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయాలని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో రాష్ట్ర విభజనను అంగీకరిస్తూ చిరంజీవి - హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, లేదంటే దేశానికి రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు చాలా మంది విభజనను వ్యతిరేకిస్తున్న స్థితిలో చిరంజీవి మాత్రం హైదరాబాదును మాత్రమే పట్టుకున్నారు. హైదరాబాద్‌ తమ చేతుల్లోంచి జారిపోకూడదనే ఉద్దేశ్యంతో ఆయన వ్యవహరిస్తూ వచ్చారు.
http://telugu.oneindia.in/grapevine/2013/asaduddin-calls-chiranjeevi-as-kid-121149.html

0 Reviews:

Post a Comment