Contact us

తెలంగాణకు వ్యతిరేకంగా బాబు చివరి అస్త్రం
రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చివరి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపడానికి ఆయన చివరి నిమిషంలో కృషి చేసినట్లు హిందూస్తాన్ టైమ్స్‌లో శుక్రవారం ఓ వార్తాకథనం వచ్చింది. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.
మంగళవారం యుపిఎ, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెసు అధిష్టానానికి చెందిన ముగ్గురు నేతలతో మాట్లాడినట్లు ఆ వార్తాకథనం సారాంశం. తెలంగాణ ఏర్పాటుకు స్వస్తి చెప్పాలని లేదా నిర్ణయంలో కాలయాపన చేయాలని చంద్రబాబు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌లను కూడా కోరినట్లు ఆ వార్తాకథనం తెలియజేస్తోది. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణను వ్యతిరేకించింది. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డియె ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చింది.
తెలంగాణకు వ్యతిరేకంగా బాబు చివరి అస్త్రం
హిందూస్తాన్ వార్తాకథనం ప్రకారం - గత రెండేళ్లలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన సందర్భంగా పడిపోకుండా కాపాడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినప్పుడు 79 మంది సభ్యులు గల తెలుగుదేశం పార్టీ తటస్థంగా ఉంది. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సురక్షితంగా బయటపడింది.
2000లలో తెలంగాణను వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ 2008 అక్టోబర్‌లో యూటర్న్ తీసుకుని తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. ఆ తర్వాత 2012 డిసెంబర్ వరకు తన తెలంగాణ అనుకూల వైఖరి విషయంలో అయోమయం సృష్టిస్తూ వచ్చింది. చివరకు 2012 డిసెంబర్ అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది.
తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ తగ్గినప్పటికీ తెలంగాణలో రాజకీయ నిర్మాణం చెక్కుచెదరకుండా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం ద్వారా కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీ మీద పైచేయి సాధించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని నిర్దేశించే స్థాయికి చేరుకుంది.

సోర్స్:oneinida

0 Reviews:

Post a Comment