
తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే కుట్రతోనే రెండు ప్రాంతాలలో చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాజకీయ స్వార్ధం కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని,ఒకవైపు టిఆర్ఎస్ , మరో వైపు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,వీటికి కాంగ్రెస్ దన్నుగా ఉందని ,వీరి కుట్రలను జనానికి చెప్పడానికి తాను ఆత్మగౌరవయాత్ర చేపడుతున్నానని ప్రకటించారు.పంచాయతీ విభజన విషయంలోనే అందరికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారని,అలాంటి జాగ్రత్త కూడా తీసుకోలేదని కేంద్రాన్ని తప్పు పట్టారు.సీమాంద్ర ప్రజలకు కొన్ని ఆందోళనలు ఉన్నాయని,వాటిపై కేంద్రం స్పందించడం లేదని అన్నారు.నీరు, హైదరాబాద్ లో భద్రత వంటి అంశాలపై కేంద్రం ఎందుకు ఉదాసీనంగా ఉందని ఆయన ప్రశ్నించారు.వీటన్నిటిని ప్రజలలోకి తీసుకువెళతామని అన్నారు.తన తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నడైనా సమ్మె ఉందా అని ఆయన ప్రశ్నించారు.ఇప్పుడు గత మూడున్నరేళ్లుగా పాలనే లేదని అన్నారు.తాము బ్లాంక్ చెక్ ఇచ్చామని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ చెబుతోందని, కాని నిజానికి అలా చేసింది వై.ఎస్.ఆర్.కాంగ్రెసేనని చంద్రబాబు ధ్వజమెత్తారు.ప్రజలకు అన్ని విషయాలు తెలియచెప్పడానికే యాత్రకు వెళుతున్నానని అన్నారు.
kommineni
0 Reviews:
Post a Comment