Contact us

మోటో X పేరుతో మర్కెట్లోకి స్మార్ట్ ఫోన్
మోటో X పేరుతో మర్కెట్లోకి స్మార్ట్ ఫోన్
ముంబై: మొబైల్‌ ఫోన్‌ ఆలోచనను మొట్ట మొదటగా అందిపుచ్చుకున్న కంపెనీల్లో మోటోరోలా ఒకటి. కాలానుగుణంగా మారలేక తీవ్రంగా దెబ్బతింది. చివరకు సెల్‌ఫోన్‌ తయారీ విభాగాన్ని ఏడాది కిందట 12.5 బిలియన్‌ డాలర్లకు గూగుల్‌కు అమ్మేసింది. ఇప్పుడు ఈ అమ్ముడయిన కంపెనీ మోటో X పేరుతో ఒక ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతానికి ఇది అమెరికా, యూరోప్‌ మార్కెట్లలో మాత్రమే లభ్యమవుతుంది. దీని ధర 200 డాలర్లు. మన కరెన్సీలో 12 వేల రూపాయలు.

4.7 ఇంచులు ఉన్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ మార్కెట్లో ఐఫోన్‌గా ఉంటుందని కంపెనీ మేనేజ్‌మెంట్‌ అయిన గూగుల్‌ భావిస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్‌ 4.2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఉంది. ఇంటర్నల్‌ మెమరీ 16 జీబీగా ఉండగా.. క్లౌడ్‌ స్టోరేజీ 50 జీబీ ఉంది. 10 మెగాపిక్సెల్‌ కెమేరా  ఉన్న మోటో X.. మార్కెట్లో టాప్‌ ఎండ్‌ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు తక్కువని భావిస్తున్నారు.

0 Reviews:

Post a Comment