Contact us

సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం

నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం
దక్షిణాది నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం వార్తతో చిత్ర పరిశ్రమ దిగ్ర్బాంతికి లోనైంది. చందమామ, వైశాలి చిత్రాల్లో నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న సింధూ మీనన్ గత రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు సమాచారం. 
 
అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రభును పెళ్లాడి బెంగుళూరులో స్థిరపడిన సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది. సింధు మీనన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మాహత్యాయత్నానికి  పాల్పడినట్టు తెలిసింది. ఆస్పత్రిలో చేర్పించే సమయానికి ఆమె అపస్మారక స్థితిలో ఉంది అని వైద్యులు వెల్లడించారు.  
 
తన స్వంత ప్రోడక్షన్ కోసం పలు వ్యక్తుల నుంచి అప్పు తీసుకున్నారని...అయితే చేసిన అప్పులు తీర్చలేకపోవడమే ఆత్మహత్యకు కారణమైనట్టు  తెలుస్తోంది. సింధుమీనన్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 
 
తమిళంలో కాదల్ పుక్కల్, యూత్, ఈరమ్ చిత్రాల్లో సింధు మీనన్ నటించింది. 

0 Reviews:

Post a Comment