
కుత్బుల్లాపూర్ స్వతంత్ర శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.శ్రీశైలం గౌడ్ కొద్ది నెలల క్రితం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు.రంగారెడ్డి జిల్లా కన్వీనర్ కూడా ఆయన కొద్ది కాలం పనిచేశారు.తదుపరి కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ నిర్ణయం తీసుకోవడం, దానికి వ్యతిరేకంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం రాజీనామాలవరకు వెళ్లడం జరిగింది. దీంతో శ్రీశైలం గౌడ్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చేశారు.డిల్లీలో పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
0 Reviews:
Post a Comment