Contact us

నాన్నకు ఈర్ష్యగా ఉంది: రాంచరణ్
నాన్నకు ఈర్ష్యగా ఉంది: రాంచరణ్
హిందీ చలన చిత్రసీమలో అమితాబ్ బచ్చన్  సూపర్ స్టార్. ఇప్పటికి బాలీవుడ్ లో అమితాబ్ హవా కొనసాగుతోంది. అమితాబ్ తో కలిసి నటించాలని ఎన్నో ఎళ్లుగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే కొందరికి తీరని కలగా మిగిలిపోతోంది. అమితాబ్ తో నటించాలని ఎదురు చేసే వాళ్ల జాబితాలో మెగాస్టార్ కూడ ఒకరని ఆయన తనయుడు రాం చరణ్ వెల్లడించారు. ఎన్నో ఎళ్లుగా అమితాబ్ తో నటించాలని చిరంజీవి ఎదురు చూస్తున్నారని.. అయితే పలు కారణాల వల్ల అది సాధ్య పడలేదని... అయితే తనకు ఆ అవకాశం దక్కడంపై చిరంజీవికి ఈర్ష్యగా ఉంది అని రాంచరణ్ తెలిపారు. 
 
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తనను చూసి ఈర్ష్య పడుతున్నారని జంజీర్ చిత్రం ద్వారా బాలీవుడ్ లో ప్రవేశిస్తున్న టాలీవుడ్ హీరో రాంచరణ్ తెలిపారు. జంజీర్ లో అమితాబ్ తో కలిసి రాంచరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్  సూపర్ స్టార్ తో కలిసి నటించే అవకాశం కోసం తన తండ్రి చాలా కాలంగా ఎదురు చూశారని.. అయితే ఆయనకు ఆ అవకాశం దక్కలేదని చెర్రీ అన్నారు. రాంచరణ్ నటించిన జంజీర్ తెలుగులో తుఫాన్ చిత్రంగా సెప్టెంబర్ 6 తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. 

0 Reviews:

Post a Comment