Contact us

కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై
కాంగ్రెస్ నుంచి మరో వికెట్ పడిపోయింది. నంద్యాల ఎమ్మెల్యే , మాజీ మంత్రి శిల్సా మోహన్ రెడ్డి పార్టీకి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.దీనికి నిరసనగా ఆయన ముందుగా నలభై ఎనిమిది గంటల దీక్ష చేపట్టి ,దానిని ఆమరణదీక్షగా మార్చారు.గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి,రోశయ్య ల క్యాబినెట్ లలో మంత్రిగా పనిచేశారు.తాను ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు.

kommineni

0 Reviews:

Post a Comment