
పిబ్రవరి ఎనిమిది లేదా తొమ్మిది తేదీలలో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. ఫిబ్రవరి పదిహేను కల్లా తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆంద్ర విభజన తనకు కూడా ఇష్టం లేదని,కాని విబజన తప్పదని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని ఆయన అన్నారు.బలమైన సమైక్యవాద నేతగా ఆయన ఎదుగుతున్నారని అన్నారు.దేశం అంతా ఆయన వైపు చూస్తున్నదని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
kommineni
0 Reviews:
Post a Comment