Contact us

2013.. ఓ ప్రేమ కథ
2013 జనవరి, అమెరికాలోని కాలిఫోర్నియా..
 ఆడ్రియానా పెరాల్. ఆమె లైఫ్ స్టైలే వేరు. బికినీలు, హైహీల్స్..
 రోజూ పార్టీలు, వైన్, విస్కీ.. తాగి తూగడం.. పొద్దున్నే జిమ్.. అంతా హైఫై.
 సీన్.. కట్ చేస్తే...

 
 2014 జనవరి, హర్యానాలోని పాప్‌రాన్ గ్రామం..
 ఆడ్రియానా పెరాల్. చుడీదార్, నెత్తిన కొంగు, నుదుటన సింధూరం.. పిడకల పొయ్యి మీద వంట వండుతోంది.. గేదెలను పీచుతో తోముతోంది.. అంట్లు తోముతోంది.. ఇళ్లూడుస్తోంది.. ఇక్కడ పార్టీలు లేవు. టాయిలెట్‌కు పోవాలన్నా బయటకు వెళ్లాల్సిందే.. షవర్ సంగతి సరేసరి.. స్నానానికి గేదెలకు, మనుషులకు ఒకటే బకెట్!
 
 ఏమిటీ మాయ.. అవును. ప్రేమ చేసిన మాయ. ఆడ్రియానా ప్రేమలో పడింది. అన్నీ వదిలొచ్చేసింది.. సంతోషంగా.. చిత్రంలో కనిపిస్తున్న ఆడ్రియానా, ముకేష్‌కుమార్‌ల ప్రేమ కథలోకి వెళ్తే.. 2013 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాకు చెందిన ఆడ్రియానా(40)కు ముకేష్(24) ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. కొన్ని నెలలు చాట్ చేసుకున్నారు. ఒక్కరోజు హఠాత్తుగా ముకేష్ ఆడ్రియానాకు ఫోన్ చేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆడ్రియానా నవ్వేసింది. ఏమిటీ పిచ్చిమాటలు నీ వయసెంత.. నా వయసెంత అంది. నాకు నీ వయసు కూతురుందని చెప్పింది. ముకేష్ ఒప్పుకోలేదు. కొన్ని రోజులుగా ఇదే తీరు. ఆడ్రియానా ఆలోచనలో పడింది. తర్వాత ఇద్దరూ ఇన్ లవ్. ఆడ్రియానా ముకేష్ కోసం కాలిఫోర్నియాను వదిలి భారత్‌కు వచ్చేద్దామని గతేడాది ఆగస్టులో డిసైడైంది. ఇంట్లో వాళ్లు వారించారు.
 
  కూతురైతే.. మహిళలకు భారత్ సురక్షితమైన ప్రదేశం కాదని చెప్పింది. ముకేష్ ఆన్‌లైన్ మోసగాడని వారించింది. ఆడ్రియానా ముకేష్‌ను నమ్మింది. వచ్చేసింది. ఎయిర్‌పోర్టులో దిగగానే ముకేష్. నేరుగా పాప్‌రాన్ గ్రామానికి.. నవంబర్‌లో సంప్రదాయరీతిలో వివాహం. అమెరికా లైఫ్‌స్టైల్‌కి.. ఇక్కడి జీవనశైలికి ఎంతో తేడా. అయితేనేం.. అలవాటుపడిపోయింది.. హిందీ మాట్లాడటం నేర్చుకుంటోంది. బట్లర్ ఇంగ్లిష్ మాట్లాడే భర్తకు ఇంగ్లిష్ నేర్పిస్తోంది.  సాగులో సాయమూ చేస్తోంది. ఇక ఆడ్రియానా అత్తగారైతే.. ఆమెపై ప్రశంసలే ప్రశంసలు.

0 Reviews:

Post a Comment