నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 11.30 గంటల వరకు ఏఎన్‌ఆర్ భౌతికకాయాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం 12.30 గంటలకు ఫిలిం చాంబర్ నుంచి అంతిమ యాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు అన్నపూర్ణ స్డూడియోలోనే నాగేశ్వరరావుకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చలనచిత్ర, వ్యాపార రంగ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అక్కినేనికి నివాళులు అర్పించారు.
అక్కినేనికి నివాళులు అర్పించిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
ప్రముఖ సినీనటులు, పద్మవిభూషన్, దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేసిన ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అక్కినేని అంత్యక్రియలు రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనున్నాయి. ఓ సినీనటుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టడం ఇదే తొలిసారి.
మరో వైపు, అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా గురువారం తెలుగు చిత్ర పరిశ్రమ బంద్ పాటించనున్నట్లు సీనియర్ నటుడు మురళీ మోహన్ తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు, షూటింగ్ లు నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

0 Reviews:
Post a Comment