Contact us

52 మంది ఎమ్మెల్యేల మద్దతు నాకు ఉంది
తనకు ఏభై రెండు మంది ఎమ్మెల్యేల మద్దతు సమకూరిందని స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభ కు పోటీచేస్తున్న చైతన్య విద్యా సంస్థల అదినేత కెవిని సత్యనారాయణ రాజు అలియాస్ చైతన్య రాజు చెప్పారు.తాను స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేస్తున్నందున అన్ని పార్టీ ల నుంచి కూడా మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు.తనకు వ్యక్తిగతంగా అన్ని పార్టీల వారితో సంబందాలు ఉన్నాయని ఆయన చెప్పారు.సీమాంద్రలో కాంగ్రెస్ లో తిరుగుబాటు తీవ్రంగా ఉందని, అదిష్టానం తీసుకున్న నిర్ణయంపై అందరికి వ్యతిరేకత ఉందని,అందువల్ల తనను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. పైగా తాను కూడా విద్యాసంస్థలను నడపడం ద్వారా సమాజంలో ఒక గుర్తింపు పొందానని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలకు ఆర్ధిక వనరులు సమకూర్చుతారన్నది సరికాదని,తాను నమస్కారం పెడుతున్నానని చైతన్య రాజు అనడం విశేషం.
kommineni

0 Reviews:

Post a Comment