తెలుగు మీడియాకు ఒక జాడ్యం ఉంది. తాము చెప్పిందే వేదం, తాము చెప్పిందే సత్యం అని అనుకోవడమే ఆ జాడ్యం. బహుశా దశాబ్దాలుగా తెలుగులో ఒక వార్తా సంస్థదే ఏకఛత్రాధిపత్యంగా ఉన్నందు వల్ల వచ్చిన జాడ్యమేమో అది. సామాన్యులను రాజకీయనాయకులుగా తయారు చేసేదీ మేమే, ప్రభుత్వాలను కూలగొట్టగలిదేదీ మేమే అని భావించే తెలుగు మీడియా వర్గాలు ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని భావిస్తున్నట్టుగా ఉన్నాయి.
తమ కులదైవమైన వ్యక్తి దూసుకుపోతున్నాడని రాస్తే అతడు నిజంగానే దూసుకుపోతాడని, తమకు నచ్చని వ్యక్తి గురించి తాము గీస్తున్న గ్రాఫులన్నీ పడిపోతున్నాయని రాస్తే నిజంగానే పడిపోతాయని మన మీడియా భావిస్తోంది. అయితే ఇవన్నీ 80ల నాటి రాజకీయాలు. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒక రోజులోనే మీడియా అంచనాలు తలకిందుల అవుతున్నాయి.
అందుకు తాజా వ్యవహారమే ఉదాహరణ.. జగన్ మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గిపోతోందని, ఆయన ఆదరణ విషయంలో తాము లెక్కలేసి గ్రాఫులు గీస్తే అవన్నీ పాతాళం దిశగా పరిగెడుతున్నాయని ఒక వర్గం మీడియా వరస కథనాలు రాస్తూ వస్తోంది. అయితే ఆ సర్వేలు ఇంకా పూర్తిగా జనాల్లోకి వెళ్లకముందే... జాతీయ మీడియా జోక్యం చేసుకొంది. కౌంటర్ సర్వేలు కాదు కానీ.. మన తెలుగు మీడియా వెలువరిచిన సర్వేలకు భిన్నమైన ఫలితాలను వెల్లడించింది జాతీయ మీడియా.
రాష్ట్రంలో జగన్ పరిస్థితి అయిపోయిందని ఏపీ మీడియా అంటుంటే.. ఓవరాల్ గా పాతిక శాతం మంత్రి తెలుగు వాళ్లు జగన్ కే ఓటు వేసే పరిస్థితి ఉందని, సీమాంధ్రలో అయితే ఈ శాతం 48 గా ఉందని జాతీయ మీడియా లెక్కలేస్తోంది. ఫలితంగా జగన్ పార్టీ కి 19 ఎంపీసీట్లు లభించే అవకాశం ఉందని నేషనల్ మీడియా అభిప్రాయపడుతోంది. ఈ సర్వేలు చూసి తెలుగు మీడియా చాలా ఆశ్చర్యపోతోంది, అవాక్కవుతోంది. కచ్చితంగా తాము తమ మార్కు సర్వేలు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే జాతీయ మీడియా తన పరిశీలనల గురించి వెల్లడించడంతో తమ అస్త్రాలు ఫెయిలయ్యాయని బాధపడుతోంది
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-opposite-media-shocks-49851.html#sthash.yCBUb3ZH.dpuf
0 Reviews:
Post a Comment