Contact us

రాజ్యసభకు ఇండిపెండెంట్ గా పోటీ
రాజ్యసభకు ఇండిపెండెంట్ గా పోటీ: ఉండవల్లి
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నట్టు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు మద్దతివ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీలో ఆయన పలువురు ఎమ్మెల్యేలను కోరారు. ‘సమైక్య ఎంపీ’గా  బరిలో దిగాలని ఆయన భావిస్తున్నారు.

సమైక్యవాదం పేరుతో ఇటీవల రాజీనామా చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చిన ఎంపీల్లో ఒకరిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. సీమాంధ్ర లోక్‌సభ సభ్యుల్లో ఒకరిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలనుకోవడం మంచి పరిణామమని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ను పోటీకి దించితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

0 Reviews:

Post a Comment