న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీలో చర్చించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరో వారం రోజులు గడువు పొడిగించారు. అయితే అధికారిక సమాచారం అందగానే బిల్లు పొడిగింపుపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో ప్రకటన చేయనున్నారు. ప్రకటన తర్వాత బీఏసీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. వారం రోజుల పాటు సభ ఎలా జరగాలన్న దానిపై బీఏసీలో చర్చించనున్నారు. దీంతో ఈనెల 30వ తేదీ వరకూ బిల్లుపై సభలో చర్చించే అవకాశం ఉంది.మరోవైపు బిల్లుపై గడువు పెంపుకు సంబంధించి ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందింది. ఇక అసెంబ్లీ ప్రారంభమయ్యాక చాలా రోజుల పాటు సభ సజావుగా నడవనందువల్ల సభ్యులందరూ చర్చలో పాల్గొనలేకపోయారని, అందువల్ల బిల్లును తిరిగి పంపించేందుకు మరో నాలుగు వారాల గడువు కావాలని కోరుతూ రాష్ట్రపతికి రాష్ట్రప్రభుత్వం లేఖ పంపిన విషయం తెలిసిందే
0 Reviews:
Post a Comment