
ఢిల్లీ డైరెక్షన్‌లోనే టీఆర్ఎస్, వైసీపీ పనిచేస్తున్నాయన్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా, రెండు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు అసెంబ్లీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఇది కుట్రలో భాగమే అని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు కిరణ్ స్
వయంగా రోడ్ మ్యాప్ తయారు చేశారని, అందులో డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ భాగస్వాములని ఆరోపించారు.సీఎం నోటీసుకు, బిల్లుకు సంబంధం లేదని దిగ్విజయ్ సింగ్ తెలివిగా మాట్లాడారన్నారు. తాను సమైక్య హీరో అయిపోవాలనే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారన్నారు.
రాష్ట్రాన్ని కాదు తెలుగు జాతి విడగొడుతున్నారని, భౌగోళికంగా విభజన జరగడం లేదని చంద్రబాబు అన్నారు. విభజన విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్ హైకమాండ్‌ను ఎదురిస్తున్నామంటూనే సోనియాపై ఈగ వాలన్విడంలేదన్నారు. అసెంబ్లీలో తనకున్న అనుభవం ఎవరికీ లేదని బాబు తెలిపారు.తెలుగు జాతిని కలిపాలని, తెలుగు జాతికి అన్యాయం జరగకుండా చూడాలన్నారు. సున్నితమైన సమస్యను జఠిలం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన విషయంలో కాంగ్రెస్ నాటకాలు సినిమాలను మించిపోతున్నాయని ఎద్దేవాచేశారు. రాష్ట్రపతి, అన్ని జాతీయ పార్టీల నేతలు మరోసారి కలిసి కాంగ్రెస్ కుట్రలను వివరిస్తానన్నారు.
0 Reviews:
Post a Comment