Contact us

రాధాకృష్ణ కు విద్యుత్ ప్లాంట్ పునరుద్దరణ
ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కు చెందిన జల విద్యుత్ కేంద్రం పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.విజయవాడ వద్ద విటిపిఎస్ కెనాల్ పై ఉన్న ఈ ప్లాంటు వల్ల ఇబ్బందులు వస్తున్నాయని విమర్శలు రావడంతో అప్పట్లో ప్రభుత్వం అనుమతిని రద్దు చేసింది. నిపుణుల కమిటీ కూడా ఈ మేరకు సిఫారస్ చేసింది. అయితే అప్పట్లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కక్షతో దీనిని రద్దు చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.ఆ తర్వాత దీని పునరుద్దరణకు ప్రయత్నాలు జరిగినా రోశయ్య ప్రభుత్వం కూడా ఇవ్వలేదు.తాజాగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో సాక్షి పత్రిక దీనిపై ఒక కదనాన్ని ఇస్తూ నాడు చంద్రబాబు, నేడు కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్లాంట్ విషయంలో రాదాకృష్ణపై ప్రేమ కనబరిచారని వ్యాఖ్యానించింది.

0 Reviews:

Post a Comment