Contact us

వై.కాంగ్రెస్ కు మాజీ ఎమ్.పి గుడ్ బై
అమలాపురం మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బుచ్చి మహేశ్వరరావు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తనకు చెప్పకుండానే అమలాపురం సమన్వయకర్త పదవి నుంచి తప్పించినందుకు గాను ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. ప్రజా సేవ చేసేవారిని కాదని డబ్బున్న వాళ్ళకే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సీట్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
, వైఎస్ కుటుంబంపై అభిమానంతో వెళ్తే నట్టేట ముంచారని మహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్.పిగా , ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఉమామహేశ్వరరావు ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ లోకి, తదుపరి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు.

courtesy:kommineni

0 Reviews:

Post a Comment