
కాంగ్రెస్ పాలనలో మన దేశం పదేళ్లు వెనక్కి వెళ్లిందని సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు అన్నారు. మంగళవారం మొగల్తూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశాభివృద్ధి నరేంద్ర మోడీ వల్లే సాధ్యమని, ఆయనే ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. యువత అంతా మోడీ వెంటే ఉన్నారని, గుజరాత్ ముస్లిం యువత ఆయనకు మద్దతు ఇవ్వడం వల్లే మాడుసార్లు ముఖ్యమంత్రి అయ్యూరని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అమెరికా తరహాలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తే సమర్ధత గల నాయకుడు మోడినా, రాహుల్ గాంధీనా అనే విషయం తేలిపోతుందని అన్నారు. రాష్ట్రంలో వివిధ పార్టీలతోపాటు సినీ రంగ ప్రముఖులు సైతం బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. బుధవారం విజయవాడలో జరిగే బీజేపీ ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయూలని పార్టీ నాయకులు, అభిమానులు తరలిరావాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు దాసరి ప్రసాదరావు, బండారు మాధవనాయుడు, దూసనపూడి వెంటేశ్వరరావు, కొత్తపల్లి రాంబాబు, బందన నాగార్జున, అందే అయోధ్య, బొడ్డు కృష్ణమూర్తి, పులపర్తి రమేష్, చింతపల్లి రవి పాల్గొన్నారు.
0 Reviews:
Post a Comment