Contact us

 కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి మరోసారి ధమ్ కా




ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి మరోసారి ధమ్ కా ఇచ్చినట్లే.రాజ్యసభ ఎన్నికల నిమిత్తం అబ్యర్దుల ఎంపిక కోసం ఢిల్లీ రావాలని పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిని కోరారు.ఆ మేరకు కిరణ్ వస్తున్నారని కూడా మీడియాతో అన్నారు.కాని శాసనసభ సమావేశాలు గడువు పొడిగించడం తో ఆ అవకాశాన్ని ఆయన వినియోగించుకున్నారు.అసెంబ్లీ ఉన్నందున రాలేకపోతున్నానని దిగ్విజయ్ సింగ్ కు చెప్పి తప్పించుకున్నారు.నిజానికి కిరణ్ ఢిల్లీ వెళ్లదలిస్తే శాసనసభ సమావేశాలు ఏమీ అడ్డంకి కాదని అందరికి తెలుసు.కావాలనే కిరణ్ వెళ్లడం లేదని అర్ధం అవుతుంది.ఎఐసిసి సమావేశాలకు వెళ్లకుండా, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల అబ్యర్ధుల ఎంపిక కోసం వెళితే అదిష్టానంతో మాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న అబిప్రాయం ప్రచారంలోకి వచ్చేది.కాని కిరణ్ ఆ అవకాశం ఇవ్వలేదు.తన మాటకే నిలబడ్డారని అనుకోవాలి.కాంగ్రెస్ తో తెగతెంపులు దిశగానే కిరణ్ కదులుతున్నారని అనుకోవాలి. అంతేకాక రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపిక చేసే అభ్యర్ధుల గెలుపు బాధ్యతను కూడా కిరణ్ స్వీకరించబోరన్న సంకేతం కూడా ఇచ్చారని అనుకోవచ్చు.కాకపోతే కాంగ్రెస్ ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కు మర్యాద కోసం ఫోన్ చేసి రావడం లేదని చెప్పారు.మరి కాంగ్రెస్ ఏమి చేస్తుందో

0 Reviews:

Post a Comment