Contact us

బిల్లుపై ఓటింగ్ ఉండాల్సిందే
బిల్లుపై ఓటింగ్ ఉండాల్సిందే: విజయమ్మ
హైదరాబాద్ :
ఓట్లకోసం, సీట్లకోసం ప్రాంతాలవారీగా  కాంగ్రెస్‌ , టీడీపీలు వాదనలు వినిపిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు.  కాని మేం రాజకీయంగా నష్టాలన్ని లెక్కచేయకుండా ఒకే వాదాన్ని వినిపిస్తున్నాం అని వైఎస్‌ విజయమ్మ తెలిపారు.
 
మీరు స్వార్థంతో వాదనలు వినిపిస్తున్నారని,  మేం త్యాగంతో ఒకే వాదన వినిపిస్తున్నామని వైఎస్‌ విజయమ్మ అన్నారు.  అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తున్నాయని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 పై ఓటింగ్‌ ఉండాల్సిందే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున విజయమ్మ డిమాండ్ చేశారు.

0 Reviews:

Post a Comment