న్యూఢిల్లీ, జన వరి 27 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చిన నోట్ వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఉందని, ఆ డైరెక్షన్‌లోనే సీఎం కిరణ్ యాక్షన్ చేస్తున్నారని టీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ అరగంటపాటు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ముఖ్యమంత్రి, చంద్రబాబు కలిసి కుమ్మకయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. సీఎం నోటీసు రాజ్యాంగ విరుద్ధమని, కేబినెట్ ఆమోదం లేకుండా నోటీసును ఎలా ఇస్తారని హరీష్‌రావు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
బిల్లును తిప్పిపంపడమంటే రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని అవమానించడమే అని హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. ఈ చర్య ముమ్మాటికి తెలంగాణను వ్యతిరేకించడమేనన్నారు. రూల్ నెం.77 ప్రకారం ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును స్పీకర్ వేంటనే తిరస్కరించాలని ఆయన కోరారు. సీఎం స్పీకర్‌కు ఇచ్చిన నోట్‌ను తిరస్కరించి, బిల్లుపై అభిప్రాయాలను కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు
0 Reviews:
Post a Comment