Contact us

ఓటు వేస్తే ఓల్వో బస్సు!
ఎమ్మెల్యేలకు జేసీ ఓపెన్ ఆఫర్.. అసెంబ్లీ లాబీల్లో అక్బరుద్దీన్, కేటీఆర్‌తో పిచ్చాపోటీ
హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి వెల్లడించారు. తనకు ఓటు వేసిన ప్రతి ఎమ్మెల్యేకు వోల్వో బస్సు ఇస్తానంటూ చమత్కరించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో వేర్వేరు సందర్భాల్లో ఎంఐంఎం నేత అక్బరుద్దీన్, టీఆర్ఎస్ నేత కే తారకరామారావుతో జేసీ పిచ్చాపాటీగామాట్లాడా
రు.
జేసీ: రాజ్యసభ ఎన్నికల్లో మీరు (ఎంఐఎం) పోటీ చేయండి.
అక్బరుద్దీన్: మేం పోటీ చేస్తే, మీరు మద్దతు ఇస్తారా ?
జేసీ: మీరు అభ్యర్థిని పెడితే విజయం సాధిస్తారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా అసహనంతో ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల కోసం ఎవరూ డబ్బు పెట్టుకోవటంలేదు. మీరు పోటీ చేసి నమస్కారం పెడితే గెలుస్తారు.
అక్బరుద్దీన్: మా ఓట్లుపోను, మరో 33 ఓట్లు కావాల్సి ఉంటుంది. వేస్తారా ?
జేసీ: 33 కాదు..40 మంది కూడా మద్దతు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు.
అక్బరుద్దీన్: చిన్న పిల్లాడిని. నేను నిర్ణయం తీసుకోలేను. అయినా మీరే నిలబడండి..మద్దతు ఇస్తాం.
జేసీ: నవాబులకు కూడా ధైర్యం లేకుంటే ఎట్లా ? అవసరమైతే నేను డబ్బు పెట్టుకుంటా..
అక్బరుద్దీన్: మీరు రాజీనామా చేసి, మా పార్టీలోకి రండి. మిమ్మల్నే అభ్యర్థిగా నిలబెడ్తాం
జేసీ: ముందు అభ్యర్థిగా నా పేరును ప్రతిపాదించండి.
ఈక్రమంలో అక్బరుద్దీన్ అక్కడి నుంచి ముందుకు కదిలారు. ఆ తర్వాత కొద్ది సేపటికి లాబీల్లోనే జేసీ, కేటీఆర్ మధ్య సరదా సంభాషణ జరిగింది..
కేటీఆర్: అక్బరుద్దీన్ మీకు ఏదో ఆఫర్ ఇచ్చారట ?
జేసీ: అది కాదుగాని..రాజ్యసభకు పోటీపై మీ సంగతి ఏంటి? కాంగ్రెస్‌తో మీ వ్యవహారం సెటిలైందా ?
కేటీఆర్: నిర్ణయించుకోలేదు. మీ పరిస్థితి ఏంటి ?
జేసీ: నేనైతే తప్పక పోటీలో ఉంటా. మీరు పోటీ చేయకపోతే నన్ను చూసుకోండి.
కేటీఆర్: తాడిపత్రికి వచ్చి ప్రచారం చేయమంటారా ?
జేసీ: నేనే ఎక్కువ ప్రచారం చేయను. మీరు రావటం ఎందుకు ? నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంతవరకు బయటి నుంచి ఏ ఒక్క నాయకుడు నా నియోజకవర్గానికి రాలేదు. ఈసారి రాజ్యసభకు పోటీ చేస్తున్నా. ఒక్కో ఓటుకు ఒక్కో వోల్వో బస్సు ఇస్తా.
కేటీఆర్: వామ్మో..వోల్వోనా..ఎక్కడికెళ్తే అక్కడ కేసులు పెడ్తున్నారు. మీకున్న కారు లాంటివి (జాగ్వార్) ఇస్తే తీసుకుంటాం. సభలో బొత్సతో ఏదో మాట్లాడుతున్నారు? పార్టీ నుంచి సస్పెండ్ చేశారా ?
జేసీ: బొత్సకు అంత ధైర్యం లేదు.
కేటీఆర్:మరి..మిమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం పార్టీలో ఎవరికి ఉంది.
జేసీ: కాంగ్రెస్‌ను నేను సస్పెండ్ చేయాలేగాని, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు.
- See more at: http://www.andhrajyothy.com/node/57068#sthash.kcd5zyLn.dpuf

0 Reviews:

Post a Comment