
అన్ని పార్టీల కన్నా ముందుగా లోక్ సత్తా రాష్ట్రంలో అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. పాతిక మందితో తొలి జాబితాను విడుదల చేశారు.తాను కుకట్ పల్లినుంచి పోటీచేస్తున్నానని లోక్ సత్తా అదినేత జయప్రకాష్ నారాయణ ప్రకటించారు.ఎన్నికల ముందు ఎవరితో పొత్తు ఉండదని కూడా ఆయన అన్నారు.కుటుంబ పాలన నుంచి దేశ రాజకీయాలు విముక్తి కావాలని జయప్రకాష్ నారాయణ అన్నారు.రాష్ట్రంలో కూడా కొన్ని పార్టీలుకుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఐదు తరాలుగా దేశ రాజకీయాలలో కుటుంబ రాజకీయాలను నడుపుతోందని అన్నారు.రాష్ట్రంలో కూడా కొన్ని పార్టీలు అదే ప్రకారం ఉన్నాయని ఆయన అన్నారు. ఆ పార్టీల గురించి కూడా గట్టిగా మాట్లాడితే పోతుంది కదా
Kommineni
0 Reviews:
Post a Comment