Contact us

టెక్కీలతో కలిసి నారా లోకేష్: వైయస్ జగన్‌పై ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవినీతిపరులు, దోపిడీదారుల పార్టీ అన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు సహకరించిన పార్టీ కాంగ్రెసు పార్టీ అని, దోపిడీ సొమ్ముతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని జగన్ పెట్టారన్నారు.
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకులు, సర్పంచులు పట్టుబడ్డారన్నారు. భూములను, గనులను, నీళ్లను దోచుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు చివరకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువు దీరిన శేషాచలం కొండల పైన ఉన్న ఎర్రచందనంను కూడా వదలడం లేదన్నారు.
టెక్కీలతో కలిసి నారా లోకేష్: వైయస్ జగన్‌పై ఆగ్రహం
హైదరాబాదులో నీరజా రావుకు చెందిన భూమిని జగన్ మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్ర నాథ్ రెడ్డి కబ్జా చేశారని గుర్తు చేశారు. చివరకు న్యాయస్థానం తీర్పుతో నీరజా రావు భూమి కేసులో న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. లోకేష్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుండి పార్టీ కార్యాలయం వరకు సాఫ్టువేర్ ఉద్యోగులు, యువతతో ర్యాలీ నిర్వహించారు.

oneindia.in

0 Reviews:

Post a Comment