Contact us

జగన్‌కు మేలు చేయనున్న రాహుల్‌ పబ్లిసిటీ
రాహుల్‌ గాంధీ తాను ప్రధాని అభ్యర్థిని అని స్పష్టంగా చెప్పుకోడానికి సంకోచిస్తున్నాడు గానీ.. తాను తప్పితే కాంగ్రెస్‌పార్టీకి మరో గత్యంతరం లేదన్నట్లుగా ఎస్టాబ్లిష్‌ చేసుకునేందుకు మహా తహతహలాడిపోతున్నాడు. ఆ విషయం ఆయన కొత్తగా ప్రింట్‌, టీవీ మీడియాల్లో తీసుకువస్తున్న ప్రచారంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిచేతికీ శక్తి పేరుతో రాహుల్‌ గాంధీ ఈ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లగల యువనేత అని కీర్తిస్తూ టీవీ ప్రకటనలు ఛానెళ్లలో గుమ్మెత్తిపోతున్నాయి. ఈ ప్రకటనల ద్వారా జగన్‌కు కూడా మైలేజీ బాగానే వస్తుందని ప్రజలు ఛలోక్తులు విసురుతున్నారు. 
ఈ టీవీ ప్రకటనలో తొలుత ఒక యువతి లేదా ఒక యువకుడు మొదట తెరపైకి వస్తారు. ఈ దేశాన్ని అర్థం చేసుకోవడం, ముందుకు తీసుకువెళ్లడం, అభివృద్ధి పథంలో నడిపించడం యువనేతకు మాత్రమే సాధ్యం అని సెలవిస్తారు. యువనేత ఘనతను కీర్తిస్తారు. చివర్లో కొన్ని సెకన్లు మాత్రం తెరమీద రాహుల్‌ బొమ్మ కనిపిస్తుంది. 
అయితే మన రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రకటనలో ఉన్న కంటెంట్‌ అంతా జగన్‌కు ఎక్కువ లాభించే అవకాశం ఉంది. ‘యువనేత’ అనే పదాన్ని వాడుతూ రాహుల్‌ ప్రకటన కీర్తిస్తూ పోతే.. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు యువనేత అంటే అర్థం జగన్‌ అన్నట్లుగా ప్రజల్లోకి బాగా ప్రచారం జరిగిపోయింది. నిజానికి జగన్‌ తనంతగా ఆ ప్రచారం చేసుకోలేదు. ఆయన ప్రత్యర్థి మీడియా సంస్థలే పనిగట్టుకుని ప్రచారం చేస్తూ.. ‘యువనేత’ అనే పదానికి జగన్‌ పర్యాయపదం అన్నట్లుగా స్థిరపరిచారు. ఇప్పుడు ఎవ్వరికైనా జగన్‌ ముందు స్పురిస్తాడు. 
పైగా రాహుల్‌ కోసం రూపొందించిన ప్రకటన మొత్తం యువనేత ఫోకస్‌తోనే సాగుతుంది. అంటే నరేంద్రమోడీ కంటె తాను యూత్‌ అని ఆయన రాహుల్‌ ఫీల్‌ కావొచ్చు గానీ.. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాహుల్‌ కంటె జగన్‌ యూత్‌ అని ప్రజలు ఫీల్‌ అయితే ఏం చేస్తారో?
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-ku-melu-cheyyanunna-rahul-49950.html#sthash.krGxHKvX.dpuf

0 Reviews:

Post a Comment