
మజ్లిస్ పార్టీ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ను , హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎంతగా అబివృద్ది చేసింది గడగడా చదివి వినిపంచారు. అనేక సంస్థల పేర్లు ఆయన చదివిని చివరికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా నిజాం హయాంలోనే మొదలైందని, అందులో ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి నేత అశోక్ గజపతిరాజు, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ కూడా అక్కడే చదువుకున్నారని అన్నారు. నిజాం ఏర్పాటు చేసిన స్కాలర్ షిప్ ఆధారంగానే ప్రఖ్యాత నేత సరోజిని దేవి లండన్ లోనే చదువుకున్నారని అన్నారు. హైదరాబాద్ లోనే నిజాం హయాంలోనే సిమెంటు రోడ్డు నిర్మించారని, బేగంపేట విమానాశ్రయం ఆయన నిర్మించారని అన్నారు. హైదరాబాద్ ను వేరే వారు వచ్చి అబివృద్ది చేయలేదని, హైదరాబాద్ చెందింది కాబట్టే అందరూ వచ్చారని ఆయన అన్నారు. రైల్వే,టిలిఫోన్, కళాశాలలు, పరిశ్రమలు తదితర వివరాలను ఆయన వివరించారు. 1856 లోనే మొదటి పోస్టాఫీస్ ఏర్పడిందని ఆయన చెప్పారు. ఆస్పత్రులు, లైబ్రరీలు, విద్యాసంస్థలు మొదలైవని నిజాం హయాంలో ఏర్పడ్డాయని ఆయన చెప్పారు.ఒకాయన నిజాం ఏమి చేశాడని ప్రశ్నిస్తే,ఇంకో ఆయన నిజాం కంటే తాను అబివృద్ది చేశానని చెప్పుకుంటున్నారని టిడిపి నేతలను ఆయన ఎద్దేవ చేశారు.1910లోనే హైదరాబాద్ లో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసిందని, ఎన్.టి.ఆర్. వచ్చాక దానిని అమ్మితే ఆరు కోట్లు వచ్చిందని ఆయన అన్నారు.అంతేకాదు మనం అంతా కూర్చున్న శాసనసభ భవనాన్ని కూడా నిజాం నిర్మించారని అక్బరుద్దీన్ చెప్పారు. సచివాలయం, గవర్నర్ బంగళా, హిమయత్ సాగర్ తదితర ప్రాజెక్టుల వివరాలు కూడా ఆయన చెప్పారు. నిజాం ప్రభుత్వం తరపున అక్బరుద్దీన్ సమర్ధంగా వాదించారని చెప్పాల్సిందే
Kommineni
0 Reviews:
Post a Comment