
చంద్రబాబు దుష్టపాలన మళ్లీ రాకూడదని ప్రజలు పూజలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో రూల్ 77, 78 కింద సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పట్టుబడుతోందని భూమన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే అంశాన్ని మరోసారి స్పీకర్ కు గుర్తు చేశామన్నారు. కాగా ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలంటూ వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి....నిరసన తెలపటంతో స్పీకర్ సమావేశాలను 15 నిమిషాలు వాయిదా వేశారు.
0 Reviews:
Post a Comment