ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఫలితాలు ఎలా ఉండేదన్నదానిపై సిఎన్ఎన్ ఐబిఎన్ చేసిన సర్వే సీమాంద్రలో వైఎస్.ఆర్.కాంగ్రెస్ కు స్వీప్ అవకాశం ఉందని చెబుతున్నా,పార్లమెంటు ఎన్నికలలో టిడిపికి కూడా గణనీయంగానే సీట్లు వస్తాయని చెప్పడం ఆ పార్టీకి కూడా ఊరట కలిగించే అంశమే.లోక్ సభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు పదకుండు నుంచి పందొమ్మిది వరకు రావచ్చని ఈ సర్వే అంచనా వేసింది.కాగా టిడిపికి తొమ్మిది నుంచి పది హేను వరకు సీట్లు రావచ్చని తెలిపింది. అయితే సాధారణంగా ఇంత తేడాతో ఫలితాలు ఇవ్వరు. పదకుండు నుంచి పందొమ్మిది సీట్లు అంటే ఎనిమిది సీట్ల గ్యాప్ ఉంచారు. అలాగే టిడిపికి ఆరు సీట్ల గ్యాప్ ఉంచారు. శాసనసభ ఎన్నికలు అయితే ఇలా ఇచ్చిన అర్దం చేసుకోవచ్చు.కాని లోక్ సభ ఎన్నికలలో ఉన్నవే నలభై రెండు స్థానాలలో ఇంత తేడాతో అంచనా ఇవ్వడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది.కాగా కాంగ్రెస్ కు ఐదు నుంచి తొమ్మిది, టిఆర్ఎస్ కు నాలుగు నుంచి ఎనిమిది స్థానాలు రావచ్చని ఈ సర్వే అంచనా వేసింది.కాగా సీమాంద్రలో నలబై ఎనిమిది శాతం ఓట్లతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ , ముప్పై శాతం ఓట్లతో టిడిపి రెండో స్థానంలో ఉన్నాయి.
kommineni
kommineni
0 Reviews:
Post a Comment