Contact us

నాటకం ఆడించారు: ఆదాల
వెంకట్రామయ్యతో నాటకం ఆడించారు: ఆదాల
నామినేషన్ ఉపసంహరణ లేఖ తాను ఎవ్వరికీ ఇవ్వలేదని రాజసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగిన ఆదాల ప్రభాకరరెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికల బరిలో కొనసాగుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడుసార్లు తనకు ఫోన్‌ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారని వెల్లడించారు. సీఎం సూచనను పరిశీలిస్తానని మాత్రమే చెప్పానని తెలిపారు.
ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతో ఎవరో నాటకం ఆడించారని ఆరోపించారు. వెంకటరామయ్యను అమాయకుడిని చేసి నామినేషన్‌ ఉపసంహరణ పత్రాన్ని ఇప్పించేలా చూశారన్నారు. నామినేషన్ ఉప సంహరణ పత్రంపై తన సంతకం చేసిన వారిపై క్రిమినల్ కేసు పెడతానని ఆయన హెచ్చరించారు. తనకు 175 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉటుందని, తాను తప్పకుండా గెలుస్తానని ఆదాల విశ్వాసం వ్యక్తం చేశారు.

0 Reviews:

Post a Comment