1390494669.jpg)
దీపక్ రెడ్డి.. దేశ రాజకీయాల్లో ఒకరకమైన సంచలన వ్యక్తి ఈయన. భారత దేశ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఆస్తులు కలిగిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు అనంతపురం జిల్లాకు చెందిన ఈ నేత. ఆ మధ్య 18 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు దీపక్ రెడ్డి. ఆ సందర్భంగా ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో తనకు 6,781 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని దీపక్ రెడ్డి పేర్కొన్నాడు! దీంతో జాతీయ స్థాయి లెక్కలన్నింటినీ తీసి చూస్తే.. అందరి కన్నా దీపక్ రెడ్డే ధనవంతుడని తేలింది. మైనింగ్ సామ్రాజ్యాధినేత అయిన దీపక్ రెడ్డి తన ఆస్తుల విలువను ప్రకటించి ఆ విధంగా అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అంత వరకూ మైనింగ్ చేస్తున్న రెడ్లంతా దొంగలే అన్నట్టుగా కలరింగ్్ ఇచ్చిన టీడీపీ వాళ్లు దీపక్ రెడ్డి తమ పార్టీ వైపు వచ్చే సరికి మాత్రం కళ్లు మూసుకొంది. ఆయన మైనింగ్ లో నీతి ఎంత? నిజాయితీ ఎంతా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొకుండానే ఆయనకు టికెట్ ఇచ్చేసి పోటీ చేయించింది. అయితే అన్ని వేల కోట్ల ఆస్తులున్నా దీపక్ రెడ్డికి ప్రజా మద్దతు లభించలేదు. ఆయన రాయదుర్గం నుంచి గెలవలేకపోయాడు. తెలుగుదేశం వాళ్లు మైనింగ్ మాఫియాలో ఒకడు అంటూ ఎన్నో ఆరోపణలు చేసిన కాపు రామచంద్రరెడ్డి వైకాపా నుంచి అక్కడ విజయం సాధించాడు.
అదంతా గతం అనుకొంటే.. ఈ సారి దీపక్ రెడ్డికి టికెట్ దక్కుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయనైతే తెలుగుదేశం తరపున తిరిగి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాడు. రాయదుర్గం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ తెలుగుదేశంలో మరికొంత మంది ఈ టికెట్ మీద కన్నేశారు. వచ్చేసారి రాయదుర్గం నుంచి తామే పోటీ చేస్తామని అప్పుడే ప్రచారం చేసేసుకొంటున్నారు. అయితే దీపక్ రెడ్డి రెగ్యులర్ గా టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబుతో టచ్ లోఉండే వ్యక్తి కాదు. అన్ని వేల కోట్ల ఆస్తులున్న ఆసామి నిత్యం పార్టీ ఆఫీసులో కూర్చొని పొద్దు పుచ్చలేడు కదా! దీంతో వేరే వాళ్లు దూసుకుపోవడానికి అవకాశం లభిస్తోంది. అయితే అసలు టైమ్ లో తాను ఎంట్రీ ఇచ్చి టికెట్ సంపాదించుకోగలనననే విశ్వాసంతో ఉన్నాడట దీపక్ రెడ్డి. మరి ఏం జరుగుతుందో చూడాలి!
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/tdp-ticket-to-richest-man-49871.html#sthash.TSBo2KJc.gfnEibze.dpuf
0 Reviews:
Post a Comment