
హత్యా రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని, పదవికోసం ఎన్‌టీ రామారావునే వెన్నుపోటు పొడిచి హత్య చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. అంతేగాక.. కాపు నాయకుడు వంగవీటి రంగాను అత్యంత దారుణంగా హత్య చేయించారన్నారు. అలాగే ఎలిమినేటి మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, పి.ఇంద్రారెడ్డిలను కూడా చంద్రబాబే హత్య చేయించారనే ఆరోపణలున్నాయన్నారు. వాటి నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వీరి మరణాలతో చంద్రబాబుకు నిజంగా సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్:
0 Reviews:
Post a Comment